సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం

71చూసినవారు
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం
తన అరెస్టు సవాల్‌ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. సోరెన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ధర్మాసనం ఎదుట ఈ విషయంపై ప్రస్తావించారు. సోరెన్‌ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అభ్యర్థనను పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్