ఈ నెల 3న తిరుపతిలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై పలు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ’సనాతన ధర్మం' అనేది వైరస్ లాంటిదని మీరు అంటున్నారు. దానిని నాశనం చేస్తామని చెబుతున్నారు. ఈ మాట ఎవరు చెప్పినా.. వారికి నా సమాధానం ఒక్కటే. మీరు 'సనాతన ధర్మాన్ని' తుడిచిపెట్టలేరు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే.. మీరే తుడిచిపెట్టుకుపోతారు‘ అని పవన్ హెచ్చరించారు.