2023, సెప్టెంబర్ 3న ఓ సదస్సులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమన్నారు. సనాతన ధర్మం తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని తెలిపారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. నాడు ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.