ఏప్రిల్ 13న ఒక్క రోజే ఒక గంట వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు సంభవించాయి. తజికిస్తాన్‌లో 6.0, మయన్మార్‌లో 5.5, జమ్ముకశ్మీర్‌లో 4.2, ఉత్తరాఖండ్‌లో 4.0 తీవ్రత నమోదైంది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవి భారత్-యూరేషియన్ ప్లేట్ల టెక్టోనిక్ కదలికల వల్ల వచ్చాయి. మార్చి 28న మయన్మార్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం 3600 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.