హుషారుగా ఆడుతూ.. పాడుతూ.. ఎదగాల్సిన బాల్యం పోషకాహార లేమితో బక్కచిక్కుతోంది. మానవ సహజ పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న మాతృమూర్తులు ఎత్తుకు తగిన బరువు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దీని నివారణకు ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా... క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేమితో సద్వినియోగం కాని దుస్థితి. ఫలితంగా బాలికలు, గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. తక్కువ బరువుతో పిల్లలు జన్మించడం.. సరైన ఎదుగుదల లేకపోవడం వంటివి సాధారణమయ్యాయి.