అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో జరిగిన భారీ పేలుడులో ఎనిమిది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా తాజాగా పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు.