యునిసెఫ్ గణాంకాలు భయపెడుతున్నాయి. ‘15 ఏళ్ల క్రితం ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారులు 48 శాతం మంది ఉంటే.. ప్రస్తుతం 36 శాతానికి మాత్రమే తగ్గింది. బలహీన చిన్నారుల శాతం 20 నుంచి 19కి వచ్చింది. బాలికల్లో పోషకాహార లోపం 21శాతం నుంచి 18 శాతానికే పరిమితమైంది. చిన్నారులకు బాల్యంలో సరైన పోషకాహారం అందకపోవడంతోనే అనారోగ్యానికి గురవుతున్నారు. శారీరక వృద్ధి సమస్యలు ఎదురవుతున్నాయి’ అని తెలిపింది.