అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు. అయినా పెద్దగా ప్రయోజనం కనపడని స్థితి నెలకొంది. దీనివల్ల వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరగడంలేదు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి చిన్నారికి నిత్యం రూ.30 చొప్పున 25 రోజుల పాటు రూ.750 ఖర్చు చేస్తున్నారు. మూడేళ్లు పైబడిన వారందరికీ పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారు.