నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పట్టణంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటిస్తూ, జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో అచ్చంపేట ఆర్ డి ఒ గోపి రామ్ కు శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్య నాయక్, బిజెపి జిల్లా కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.