జోగులాంబ గద్వాల జిల్లా లో రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం హన్వాడ మండల లోని బుద్దారం గ్రామం లో ఎస్సీ కమ్యునిటీ హాల్ వద్ద వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు.