గట్టు మండల పరిధిలోని గట్టు, బల్గెర గ్రామంలో మరియు కేటి దొడ్డి మండల చింతలకుంట గ్రామంలో జరిగిన శ్రీ భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి నాయకులు బాసు హనుమంతు నాయుడు పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు బాసు హనుమంతు నాయుడును శాలువాతో సోమవారం ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక కవి, తత్వవేత్త, కురుబ సామాజికవర్గ ఆరాధ్య దైవం కనకదాసు జీవిత చరిత్రను భావి తరాలకు తెలియజేయాలని కోరారు.