దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం వెల్కిచర్ల గ్రామంలో జడ్పీ హై స్కూల్ 2005-2006 బ్యాచ్ విద్యార్థులు మహబూబ్ నగర్ లోని ఓ కన్వెన్షన్ హాల్ లో మంగళవారం సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గురువులైనందుకు తమకు చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. విద్యార్థులు తమను గుర్తుపెట్టుకుని కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.