దేవరకద్ర: కొత్తకోటలో శ్రీ గోదాదేవికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండల కేంద్రంలోని ధనుర్మాసం సందర్భంగా చివరి రోజు ఆదివారం గోదాదేవికి అభిషేకాలు, అష్టోత్తరాలు, మహా మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి తిరుప్పావై పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్, భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్