మహబూబ్ నగర్: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసన ర్యాలీ

58చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం పలు హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాడులు చేయడం మంచి పద్ధతి కాదని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులపై బంగ్లాదేశ్ లో హిందువులపై అత్యాచారాలు, దోపిడీలు, ఆస్తులను ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. అక్కడి హిందువులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.