దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్దయ్యపల్లి గ్రామ శివారులో 288 డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది. ఈ ఇండ్లను అర్హత కలిగిన వారికి కాకుండా అర్హత లేని వారికి ఇచ్చారని బిజెపి నాయకులు మాపై బురద చల్లుతున్నారని మేము పేద ప్రజలకు ఇండ్లు కేటాయించామని ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు సహించే లేదు. మా ప్రభుత్వం పేద ప్రజల కోసం పనిచేస్తుందని మాపై తప్పుడు ఆరోపణ చేయకూడదు. సోయి పెట్టి కళ్ళు తెరిచి చూడమని బిజెపి పార్టీపై బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోరింగ్ నర్సింలు అన్నారు.