జోగులాంబ గద్వాల జిల్లా లో శనివారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి అయిజ మండలం సీటీపాడు గ్రామానికి వెళ్లే వంతెన పూర్తిగా దెబ్బతినింది. ఉన్న కొద్దిపాటి వంతెన మెత్తబడి కూలింది. కూలిన ప్రాంతంలో వాహనాలు ప్రయాణించకుండా పోలీసులు బ్యారిగెట్ ను అడ్డంగా పెట్టారు. దీంతో బస్సులు, లారీలు, జీపులు తదితర వాహనాలు తిరిగేందుకు ఇబ్బందికరంగా తయారయింది. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా తిరగడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త వంతెనను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.