తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలలో 5, 6వ తరగతి నుంచి 9వ తరగతిలలో మిగిలిన సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష ఉంటుందని గద్వాల్ ప్రిన్సిపల్ కె. రాజు సోమవారం తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థులకి ఉచితంగా విద్య, భోజన వసతి, దుస్తులతో పాటు ఆంగ్ల విద్య అందిస్తామని స్పష్టం చేశారు. దీంతో అర్హత కలిగిన విద్యార్థులు కులం, ఆదాయం, జనన ధ్రువపత్రాలతో ఫిబ్రవరి 1వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలన్నారు.