Dec 02, 2024, 12:12 IST/
త్వరలో గ్రూప్-1 నియామక పత్రాలు: CM
Dec 02, 2024, 12:12 IST
త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామకపత్రాలు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా HYDలో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. ‘563 మంది గ్రూప్ 1 అధికారులను రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా TGPSC పని చేస్తోంది. దానిని రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదు. అందుకే సీనియర్ IAS బుర్రా వెంకటేశంను ఛైర్మన్గా నియమించాం’ అని వ్యాఖ్యానించారు.