జాతీయ మరియు తెలంగాణ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 14న మహబూబ్ నగర్ జిల్లా కోర్టు సముదాయంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. లోక్ అదాలత్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మహబూబ్ నగర్ జడ్చర్లలో లో 6 బెంచీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వాదిదారులు ఎవరైనా ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.