కల్వకుర్తి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం

69చూసినవారు
కల్వకుర్తి నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మండలంలో శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఈనెల 19 నుండి కంటి శుక్లాలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతున్న వారికి అందుబాటులో ఉండేందుకు ఉచితంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ సుంకు రెడ్డి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఈ శిబిరంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం అందించబడుతుందన్నారు.