ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కుంభమేళలో కోట్లమంది ప్రజలు పాల్గొన్నారు. వీరితో పాటు నాగ సాధువులు, అఘోరాలు, బాబాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ అఘోర వీడియో వైరల్ అవుతోంది. ఒంటిపై పాములు, పుర్రెలతో అఘోర భయంకరంగా ఉన్నాడు. అతడిని చూడటానికి ప్రజలు ఎగబడుతున్నారు.