నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లి గ్రామానికి చెందిన పసుపుల పరశు రాముడు ఖేలో ఇండియా అథ్లెటిక్స్ కోచ్ గా శనివారం ఎంపికయ్యాడు. 5వ ఖేల్ ఇండియా యూత్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ లో ఈనెల 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు తెలంగాణ రాష్ట్ర నుండి ముగ్గురు అథ్లెటిక్స్ కోచ్ లు వెళ్లగా అందులో ఒకరు పరశు రాముడు కు ఈ అవకాశం దక్కింది. ప్రస్తుతం నల్గొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ బాలికల క్రీడా అకాడమీలో అథ్లెటిక్స్ కోచ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఎంపిక పట్ల నాగర్ కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సోలపోగుల స్వాములు, అధ్యక్షుడు విజేందర్ యాదవ్, ఉపాధ్యక్షుడు బీనమోని బిక్షపతి యాదవ్, కోశాధికారి విజయ్, ఉపాధ్యాయ బృందం, సీనియర్ జాతీయ స్థాయి క్రీడాకారులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.