వారసత్వ కట్టడాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సెషన్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు హాజరయ్యారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ నెల 31 వరకు కొనసాగే సమావేశాలకు మన దేశం మొదటిసారి ఆతిధ్యం ఇచ్చింది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఓద్రే అజులై, మంత్రి గజేంద్రసింగ్ షెకవత్, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు.