హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ఖతార్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ కోసం మధ్యవర్తిత్వం నుంచి వైదొలిగినట్లు స్పష్టం చేసింది. ‘హమాస్- ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదరకపోతే మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను నిలిపివేస్తాం. గాజా స్ట్రిప్‌లో యుద్ధం కారణంగా ఎదుర్కొంటున్న పౌరుల ఇబ్బందులను తగ్గించేందుకు ఇరువర్గాలు సుముఖత వ్యక్తం చేసినప్పుడే మా ప్రయత్నాలు పునరుద్ధరిస్తాం’ అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.