చినాయపల్లి చెంచు కుటుంబాలకు 60 ఇండ్లు శాంక్షన్

364చూసినవారు
చినాయపల్లి చెంచు కుటుంబాలకు 60 ఇండ్లు శాంక్షన్
మహమ్మదాబాద్ మండల పరిధిలోని చిన్నాయపల్లి గ్రామపంచాయతీ నందు చెంచు కుటుంబాలకు 60 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి వారికి ఇల్లు కట్టించాలని పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ని కలవడం జరిగింది. అందుకు ఆయన స్పందిస్తూ ఎవరైనా కాంట్రాక్టర్ ముందుకు వస్తే హౌసింగ్ కాంట్రాక్టు ఇస్తామని ఇళ్ల నిర్మాణం వరద గతిన పూర్తి చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శాంతి రంగ్యా నాయక్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండాకాలం ఉంది మళ్లీ వర్షాకాలం సీజను మొదలు అయ్యే లోపు ఇల్ల నిర్మాణం పూర్తి చేయాలని లేదంటే చెంచు కుటుంబాలు ఇబ్బందుల్లో పడక తప్పదని ఆమె వివరించారు. కార్యక్రమంలో చిన్నాయపల్లి ఎస్టీ ,యువతి యువకులు పాల్గొని పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కి విన్నవించుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్