ఆత్మకూరులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

81చూసినవారు
ఆత్మకూరులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం పరిధిలోని ఆత్మకూరు మున్సిపాలిటీలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదవ వార్డులో మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్, కమిషనర్ నాగరాజుతో కలిసి ఐదవ వార్డులో తిరుగుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా వ్యాపించకుండా పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పురవీధుల గుండా తిరుగుతూ అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్