నారాయణపేట జిల్లా, మక్తల్ మండలం, పారేవుల గ్రామంలో సోమవారం శ్రీ సత్యసాయి బాబా మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 12 వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్దలతో బాబా చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి కీర్తనలతో భజనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి పూర్వ సత్యసాయి త్రాగునీటి పథకం సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట సత్యసాయి సేవా సమితి కన్వీనర్ చిట్టెం మాధవరెడ్డి, గోపీనాథ్ రావు, మల్లికార్జున్, మోహన్, శివరాజ్, సురేష్, సాయిరామ్, ఉపసర్పంచ్ లక్ష్మణ్, బసంత్ రెడ్డి, బ్రహ్మానందం, గోవర్ధన్, అనంతయ్య, నాగరాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Where: మక్తల్