AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి పులివెందులలో పర్యటించనున్నారు. ఈ నెల 26న వైయస్‌ఆర్ ఫౌండేషన్, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను జగన్ ప్రారంభించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు. ప్రజాదర్భార్ నిర్వహించి జిల్లాలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు .