SLBC ప్రమాద ఘటన చాలా బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శ్రీశైలంలోని SLBC టన్నెల్ వద్ద నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గతంలో మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగలేదని జానారెడ్డి అన్నారు. టన్నెల్‌లో చుక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.