వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతి మరియు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలను గ్రామ యువత పెద్ద ఎత్తున మంగళవారం నిర్వహించారు. జయంతి సందర్భంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారత తొలి రాష్ట్రపతిగా దేశానికి చేసిన సేవలను, హిందీని జాతీయ భాషగా చేసేందుకు ఆయన కృషిని, భారతరత్న అవార్డు అందుకున్న మొదటి రాష్ట్రపతిగా ఆయన ఘనతను గుర్తు చేసుకున్నారు.