నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను కాల్చి బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాల రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ. అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో పండించిన వేరుశనగ పంటకు అచ్చంపేట మార్కెట్ యార్డులో సరైన గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు.