ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి బీజినపల్లి మండల కేంద్రంలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో కలిసి కబడ్డీ, వాలీబాల్ అడిన ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , డీసీసీబీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.