కల్వకుర్తి మండలం జిల్లెల్ల గ్రామంలో సోమవారం 3వరోజు కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని కంటి వెలుగు శిబిరం వైద్యులు డాక్టర్ శరత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు గ్రామంలో 600 మందికి కంటి
పరీక్షలు నిర్వహించి 250 మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు 233 మందికి శస్త్ర చికిత్స నిమిత్తం రిఫర్ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్తల్మిక్ ఆఫీసర్ జగదీశ్వర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ శివకుమార్, ఏఎన్ఎంలు రాములమ్మ , సూర్య కళ, సూపర్వైజర్ యశోద , ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.