కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వైద్య అధికారి శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని జీడిపల్లి తండా లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో ఉచిత కంటి పరీక్షలతో పాటు కళ్ళజోళ్ళు, ఔషధాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్టోలోమోలోజిస్ట్ జగదీశ్వర్, క్యాంపు వైద్యులు శరత్ రెడ్డి, ఏఎన్ఎం షాహిన్, సుజాత, ఆశ వర్కర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.