గుడిసెలు లేని గ్రామాలుగా మారాలని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆవరణ, తాడూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ విలేజ్ గా భూమి పూజ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని, ప్రతి లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.