నారాయణపేట జిల్లా ధన్వాడ మండల గున్ముక్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సన్మానించి మెమోంటో అందజేశారు. హెడ్మాస్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇక్కడ పనిచేశానని విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేసానని అన్నారు. బదిలీపై ఇక్కడికి వచ్చిన వారు కూడా విద్యాభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.