ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నారాయణపేటలోని స్వామి వివేకానంద మున్సిపల్ పార్క్ వద్ద తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ డిఏ లు ఇవ్వాలని, నూతన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.