నారాయణపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుండి ఎండలు తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ ఈదురు గాలులతో సుమారు అర గంట పాటు భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షం పడటంతో చల్లదనాన్ని అస్వదించారు. పనుల కొరకు బయటికి వచ్చిన ప్రజలు వర్షంతో ఇబ్బందులు పడ్డారు.