కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

590చూసినవారు
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్ పేట్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని కోడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు 100 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. బుధవారం ఖమ్మం వేదికగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. గతంలో 827 ఉండే కంటి వెలుగు బృందాలు. ఇప్పుడు 1500 లకు పెంచామని ఎమ్మెల్యే పట్ణం నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మీ ఇంటి దగ్గరకే వచ్చి కంటి పరీక్షలు చేస్తారన్నారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రజల దగ్గరికి ప్రభుత్వం వస్తోందని. తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తుందని వెల్లడించారు. దేశానికి దీక్షుచిలా తెలంగాణ ఉందని. కేసీఆర్ గారు తెలంగాణ ప్రతిష్ట, గౌరవం పెంచడంతో పాటు ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు మన కార్యక్రమాలను మేచుకొన్నారని తెలిపారు. కంటి చూపుతో బాధపడే వారికి ఈ కార్యక్రమం వెలుగు నింపుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1, 500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. దీని కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16, 556 చోట్ల అధికారులు శిబిరాలను ఏర్పాటు చేశారు. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా అన్నిరోజుల్లో కంటి పరీక్షలు చేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి కిష్టమ్మ, కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డి, పర్యవేక్షకురాలు నీలమ్మ,ఎ ఎన్ ఎమ్ సాయమ్మ, వెంకటమ్మ, జెడ్ పి టి సి ప్రకాష్ రెడ్డి,ఎమ్ పి టి సి నర్సిములు, సర్పంచ్ హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్