వారోత్సవాల్లో భాగంగా సోమవారం నారాయణపేట పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీసుల ఆయుధాలు ఎలా పనిచేస్తాయి, పోలీస్ జాగిలాలు దుండగులను ఎలా పసిగడతారు అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. బాంబు స్క్వాడ్ బృందాలు ఎలా తనిఖీలు నిర్వహిస్తారు అనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్ మాట్లాడుతూ. ప్రజల రక్షణకు ప్రాణాలు వదిలిన అమరుల త్యాగాలు గొప్పవన్నారు.