రైతులు పండించిన అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాము డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట భగత్ సింగ్ భవన్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని అన్నారు. రైతుబంధు డబ్బులు అందించాలని, రెండు లక్షలు రుణాలు ఉన్న ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేయాలని చెప్పారు.