డిఎస్సి ద్వారా ఎంపికైన 1: 3 ఉపాధ్యాయుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నారాయణపేట పట్టణంలోని బీసీ హాస్టల్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సహాయం కొరకు బుధవారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి తెలిపారు. సహాయ కేంద్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు తగు సహాయం, సలహాలు, సూచనలు ఇస్తారని, ఏవైనా అనుమానాలు ఉన్న వారు సహాయ కేంద్రంలో నివృత్తి చేసుకోవాలన్నారు.