నారాయణ్ పేట్: వ్యవసాయ కూలీలకు జీవన భృతి ఇవ్వాలని ధర్నా

62చూసినవారు
నారాయణ్ పేట్: వ్యవసాయ కూలీలకు జీవన భృతి ఇవ్వాలని ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కూలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, జీవన భృతి కింద రూ. 12 వేలు ఇవ్వాలని ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నారాయణపేట తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామాల్లో చాలా మంది పేద ప్రజలు వ్యవసాయ కూలీలుగా జీవనాన్ని గడుపుతున్నారని, ఏడాది పొడవునా పని దొరకక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్