నారాయణపేట మండలం, సింగారం గ్రామంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి సింగారం వాగుకు వరద ప్రవాహం ఇంతకింతకు పెరగడంతో వాగు ఉగ్రరూపం దాల్చింది. గ్రామ విశ్వ హిందూ పరిషత్ అధ్వర్యంలో నీటి ప్రవాహం తగ్గాలంటూ గంగాదేవికి శాంతి పూజలు నిర్వహించి, హరతీ పట్టారు. గ్రామ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నీటి ప్రవాహం తగ్గాలంటూ శాంతి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బోర్లు రిచార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. అంతకుముందు శ్రీ చింతలరాయ స్వామి వారికి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిద్దప్ప, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లప్ప, వెంకటప్ప, క్రిష్ఠపార్, చంద్రకాంత్, నర్సిములు, విశ్వ భాను, ఆశప్ప, మహిళలు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.