ప్రజల కోసం అహర్నిశలు కృషిచేసి గౌరవప్రదంగా పదవి విరమణ పొందడం అదృష్టమని వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా సాయుధ దళ కార్యాలయంలో కానిస్టేబుల్ నుండి ఏఆర్ ఎస్ఐ గా విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందుతున్న ఏఆర్ ఎస్ఐ వి. శ్రీనాథ్ రెడ్డిని శాలువాతో సత్కరించి వారి సేవలను అభినందించారు.