కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వనపర్తి జిల్లా బిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో శనివారం రాజీవ్ చౌక్ లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ సాధకుడు కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన సీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు.