మొసళ్లు నీటిలో ఉంటే ఎంత బలంగా ఉంటాయో తెలిసిందే. అయితే, అవి బయటకు వస్తే ఇక్కడ జీవించే చిన్న జీవాలకు కూడా భయపడతాయి. తాజాగా అటువంటి ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ.. నీటి నుంచి బయటకు వచ్చిన ఓ భారీ మొసలిని రెండు కుక్కలు చుట్టుముట్టాయి. దానిని కరవడానికి ప్రయత్నించాయి. కుక్కల నుంచి తప్పించుకోవడానికి మొసలి విశ్వప్రయత్నాలు చేసింది.