రీల్స్ కోసం కొందరు తమ ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. అలాంటిదే ఇప్పుడు ఓ యువతి మృత్యువు అంచుకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హరిద్వార్‌లో గంగా ఘాట్ వద్ద ఒక అమ్మాయి నీళ్లలో ఏర్పాటు చేసిన శివలింగం వద్ద రీల్ చేస్తూ.. రైలింగ్ ఎక్కి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించి గంగానదిలో పడిపోయింది. అదృష్టవశాత్తూ రైలింగ్ రాడ్ పట్టుకుని ఒడ్డుకు చేరుకోగలిగింది.