హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17న సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఈ జిల్లాల్లో ఈనెల 17కు బదులు నవంబర్ 9న పని దినంగా అధికారులు ప్రకటించారు.