మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

50చూసినవారు
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
AP: వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఓ యువకుడితో ఒంటరిగా మాట్లాడుతుండగా.. నిందితుల్లో ఒకరు ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోతో బాలికను బ్లాక్‌మెయిల్ చేసి ఉదయ్ కిరణ్, మరో ఇద్దరు మైనర్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్